Home సినిమా నాగార్జున సంతోషం సినిమాలో బుడ్డోడు ఇప్పుడు యెంత అందంగా ఉన్నాడో…ఏం చేస్తున్నాడో తెలుసా…

నాగార్జున సంతోషం సినిమాలో బుడ్డోడు ఇప్పుడు యెంత అందంగా ఉన్నాడో…ఏం చేస్తున్నాడో తెలుసా…

0

అక్కినేని నాగార్జున,కె దశరధ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సంతోషం చిత్రం ఇప్పటికి కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది.ఈ చిత్రం ఇప్పటికి కూడా టీవిలో ప్రసారమైనప్పుడు మంచి టిఆర్పి రేటింగ్స్ ను దక్కించుకుంటుంది.2002 లో రిలీజ్ అయినా ఈ చిత్రం లో అక్కినేని నాగార్జున కు జోడిగా గ్రేసీ సింగ్ మరియు శ్రీయ నటించారు.ఫ్యామిలీ బాక్గ్రౌండ్లో ఎమోషన్స్ తో కలగలిపిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ చిత్రంలో ప్రతి క్యారక్టర్ కూడా ప్రేక్షకులకు ఇప్పటికి బాగా గుర్తుంటుంది.

అయితే సినిమాలో నాగార్జున కొడుకుగా చేసిన బుడ్డోడు కూడా అందరికి గుర్తుండే ఉంటాడు.బొద్దుగా,లడ్డులాగా క్యూటీగా ఉండే బుడ్డోడు ఇప్పుడు చాల అందంగా ఉన్నాడు.ఆ బుడ్డోడి పేరు అక్షయ్ బచ్చు.అక్షయ్ హిందీ లో పలు సినిమాలలో నటించారు.అదే సమయంలో హిందీ లో అక్షయ్ నటన చుసిన నాగార్జున సంతోషం సినిమాలో తన కొడుకుగా చేసే పాత్రలో అక్షయ్ ను తీసుకున్నారు.హిందీలో పలు సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి అక్షయ్ మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత తెలుగులో ప్రభాస్,త్రిష కంబినేషన్లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా అయినా వర్షంలోనూ అక్షయ్ నటించాడు.ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ తన చదువుపైనే దృష్టి సారించాడు అక్షయ్.ప్రస్తుతం యువకుడిగా అక్షయ్ హిందీ లో పలు సినిమాలు మరియు సీరియల్స్ లో నటిస్తున్నాడు.ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిల్ అయినా అక్షయ్ దాదాపు 12 సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు.45 కు పైగా యాడ్ ఫిలిమ్స్ లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here