Home సినిమా తెలుగులో టాప్ స్టార్స్ కు జోడిగా నటిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా..

తెలుగులో టాప్ స్టార్స్ కు జోడిగా నటిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా..

0

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ కు సంబంధించిన చాల మంది స్టార్ హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ప్రస్తుతం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో టాప్ లిస్ట్ లో ఉన్న ఒక స్టార్ హీరోయిన్ కి సంబంధించిన చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈమె ఎవరో కాదు..నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ఒక లైలా కోసం అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ పూజ హెగ్డే.వరుణ్ హీరోగా తెరకెక్కిన ముకుంద సినిమాలోని గోపికమ్మ పాటతో పూజ మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

గత సంవత్సరం త్రివిక్రమ్ అల వైఖుంఠాపురములో అనే చిత్రంతో యెనలేని క్రేజ్ తెచ్చుకుంది.ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటిస్తూ హీరోల బెస్ట్ ఆప్షన్ గా మారిపోయింది.టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ కు జోడిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రంతో మరొక హిట్ తన ఖాతాలో వేసుకుంది.తమిళ్ లో కూడా విజయ్ కు జోడిగా బీస్ట్ చిత్రంలో నటించింది.బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతూ సాంగ్ యూ ట్యూబ్ లో రిలీజ్ అయ్యి సంచలనం సృష్టిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

మాల్దీవ్స్ లో సందడి చేసిన పూజ అక్కడి ఫోటోలను షేర్ చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా నటించింది పూజ.ఇటీవలే రిలీజ్ అయినా ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.అలాగే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా కూడా నటిస్తుంది.ఆచార్య చిత్రం ఫిబ్రవరి 4 న విడుదల కానుందని సమాచారం.పూజ హెగ్డే మాతృ భాష తులు అయినప్పటికీ హిందీ,ఇంగ్లీష్,తెలుగు,మరాఠీ,కన్నడ కొద్దిగా తమిళ్ కూడా మాట్లాడగలదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here