సీనియర్ ఎన్టీఆర్ చేతి రాత చూశారా.. అక్షరాలు ఆణిముత్యాలే..!

SR NTR Handwriting

రాష్ర్టం వ్యాప్తంగా.. కాదు.. కాదు.. దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న నటుడు దివంగత నందమూరి తారక రామారావు (సీనియర్). ఆయనంటే తెలుగు అభిమానులలో ఎంతో క్రేజ్ ఉంటుంది. చిత్ర సీమతో అన్నా అని పిలిపించుకున్న ఆయనను ప్రతీ తెలుగు కుటుంబం కూడా తన ఇంటి పెద్దలా భావిస్తారు. అప్పట్లో ఆయన పోస్టర్ ను చూసే థియేటర్లకు వెళ్లే వారు అభిమానులు. ఇక ఆయన నటను గురించి చెప్పాలంటే పెద్ద సాహసమే అనకమానదు. గొప్ప వారు ఏ పని చేసినా గొప్పగానే ఉంటుందనడంలో సందేహం లేదు. 

Advertisement

ఆయన చేతి రాత కూడా అంతే అందంగా ఉండేది. చదుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందని నమ్మే ఆయన చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు. తెలుగు భాషపై ఆయనకు మంచి పట్టుంది. చిత్ర లేఖనంపై కూడా ఆయనకు మంచి పట్టుంది. అప్పట్లో 1100 మంది రాసిన మద్రాస్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ లో ఆయన 7వ ర్యాంకు లో నిలిచి మంగళగిరిలో సబ్ రిజిస్ర్టార్ ఉద్యోగానికి కూడా ఎంపికయ్యారు.

SR NTR Handwriting
SR NTR Handwriting

ఇక ఆయన చేతి రాత విషయానికి వస్తే అక్షరాలు ఆణిముత్యానే చెప్పాలి. ఎక్కడా, తప్పులు కానీ, అక్షర దోషాలు కానీ ఉండవు. చూస్తేనే చదవాలనిపించే చక్కటి శైలిని కూడా ప్రదర్శించేవారు ఆయన. ఒక సినిమా షూటింగ్ మధ్యలో దొరికిన గ్యాప్ లో రాసిన లేఖ ఒకటి ఇటీవల ‘విజయ చిత్ర’ అనే పత్రికలో ముద్రించారు. ఇప్పుడిది వైరల్ గా మారింది. అలనాటి (ఇప్పటికీ ఎందరికో) అభిమాన నటుడి చేతి రాత కోసం నెటిజన్లు ఆసక్తి కనబరుస్తుండడం విశేషమే.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *