Home సినిమా రమ్యకృష్ణ కెరీర్ ను మలుపు తిప్పి స్టార్ డమ్ తెచ్చిపెట్టిన ఆ 10 సినిమాలు ఏవో...

రమ్యకృష్ణ కెరీర్ ను మలుపు తిప్పి స్టార్ డమ్ తెచ్చిపెట్టిన ఆ 10 సినిమాలు ఏవో తెలుసా…

0
ramya krishna movies

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ రమ్యకృష్ణ కూడా చాల సెన్సేషన్ క్రియేట్ చేసారు.రమ్యకృష్ణ వయస్సు పెరిగిన కూడా ఇప్పటికి తరగని అందంతో ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నారు.ఆమె దేవతగా,శివగామి గా,పోలీస్ పాత్రలో ఇలా ఏ పాత్ర అయినా సరే చేయగల టాలెంట్ ఉన్న హీరోయిన్ రమ్య కృష్ణ అని చెప్పడంలో సందేహం లేదు.ప్రేక్షకులకు తన నటనతో ఎంతగానో ఆకట్టుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.ఇక పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయినా రాజమౌళి బాహుబలి సినిమాలో శివగామి గా ఆమె నటన మరో లెవెల్ అని చెప్పచ్చు.అయితే ఆమె కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలు ఏంటంటే..

సూత్రధారులు:కె విశ్వనాధ్ దర్శకత్వంలో సూత్రధారులు అనే సినిమాలో రమ్యకృష్ణ నటనకు మంచి గుర్తింపు లభించింది.

అల్లుడుగారు:రాఘవేంద్ర రావు దర్శకత్వంలో 1990 రిలీజ్ అయినా అల్లుడు గారు సినిమాలో తన నటనతో అందంతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు రమ్యకృష్ణ.ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

నరసింహ:రజనీకాంత్ హీరోగా చేసిన నరసింహ సినిమా రమ్యకృష్ణ కెరీర్ లో మర్చిపోలేని సినిమాగా గుర్తుండిపోతుంది.ఈ సినిమాలో ఆమె చేసిన నీలాంబరి పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోతుందని చెప్పచ్చు.

అల్లరిమొగుడు:ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా గా వచ్చిన ఈ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు రమ్యకృష్ణ.

హలో బ్రదర్:యాక్షన్ రొమాంటిక్ కామెడీ గా వచ్చిన ఈ చిత్రంలో నాగార్జున కు జోడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఘరానా బుల్లోడు:ఈ సినిమాలో నాగార్జున,రమ్యకృష్ణ,ఆమని ప్రధాన పాత్రలలో నటించారు.ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకున్నారు రమ్యకృష్ణ.

అమ్మోరు:హారర్ డ్రామా గా వచ్చిన ఈ చిత్రంలో రమ్య కృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమాలో సౌందర్య,రమ్యకృష్ణ,సురేష్ రామిరెడ్డి ప్రధాన పాత్రలలో కనిపించారు.

సోగ్గాడి పెళ్ళాం:యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు రమ్యకృష్ణ.

ఆహ్వానం:శ్రీకాంత్ హీరోగా రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా గా వచ్చిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

బాహుబలి:ఈ సినిమాలో శివగామి పాత్రలో తన అద్భుతమైన నటనతో ఇండియా లెవెల్ లో తన టాలెంట్ ను చూపించారు రమ్యకృష్ణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here