ఎన్టీఆర్ కు బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ సినిమా ఇదే..

జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెర మీద ప్రసారం అవుతున్న ఎవరు మిలో కోట్లిశ్వరులు షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే ఎన్టీఆర్ మరోపక్క రియాలిటీ షో ద్వారా కూడా ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు.ఈ షో ద్వారా ఎన్టీఆర్ కంటెస్టెంట్స్ తో తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.ఈ షో లో ఇటీవలే రాజా రవీందర్ అనే కానిస్టేబుల్ కోటి రూపాయలు గెలుచుకున్నారు.ఎవరు మిలో కోటీశ్వరులు షో చివరి ఎపిసోడ్ డిసెంబర్ 2న ప్రసారం అవుతుంది.

అయితే ఎవరు మిలో కోటీశ్వరులు షో చివరి ఎపిసోడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ గా వస్తున్నారు.ఇటీవలే తాజాగా ఎన్టీఆర్ తనకు పవన్ కళ్యాణ్ సినిమా అయినా తొలిప్రేమ సినిమా అంటే చాల ఇష్టమని కంటెస్టెంట్ తో చెప్పడం జరిగింది.కరుణాకరన్ దర్శకత్వం వహించిన తొలిప్రేమ చిత్రం 1998 లో రిలీజ్ అయ్యింది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా కీర్తి రెడ్డి నటించారు.ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ సినిమాలలో చాల గుర్తింపు ఉన్న చిత్రం అని చెప్పచ్చు.

అయితే పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా అంటే నాకు చాల ఇష్టమని పవన్ సినిమాల గురించి ఎన్టీఆర్ మాట్లాడడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.స్టార్ హీరోలు ఒకరి సినిమాల గురించి మరొకరు పాజిటివ్ గా కామెంట్స్ చేయడంతో ఆ హీరోల అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇది ఇలా ఉంటె జూనియర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ట్రిపుల్ ఆర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 7, 2022 ప్రేక్షకుల ముందుకు రానుంది.భారీ బడ్జెట్ తో ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని డివివి దానయ్య పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ట్రిపుల్ ఆర్ చిత్రం నుంచి రిలీజ్ అయినా జనని పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని అత్యధిక వ్యూస్ తో సరికొత్త రికార్డ్ ను సృష్టిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *