Credit Card Bill: మనదేశంలో ప్రతిరోజు కూడా లక్షలాది కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. డిజిటల్ రూపంలో లేదా నగదు రూపంలో కూడా ఈ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అప్పు కట్టడం కష్టమైనా సందర్భంలో క్రెడిట్ కార్డు చాలామందికి ఆర్థిక భారంగా మారుతుంది. క్రెడిట్ కార్డును వాడిన తర్వాత సరైన సమయానికి ఆ బిల్లును చెల్లించకపోతే క్రెడిట్ కార్డు బిల్లు అమంతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా వడ్డీ రేట్లు లేదా ఇతర రేట్లు కూడా పెరిగిపోవడంతో క్రెడిట్ కార్డు వినియోగదారుడు కట్టలేని పరిస్థితిలో ఉంటాడు. అతని సిబిల్ స్కోర్ పడిపోవడం వంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి.
అయితే సదరు బ్యాంకులు కూడా ఒక వ్యక్తి సరైన సమయానికి పేమెంట్ కట్టకపోతే ఆ పేమెంట్ వసూలు చేసేందుకు రికవరీ ఏజెంట్లను కూడా పంపిస్తారు. అయితే మొదట్లో ఒకటి రెండు సార్లు రికవరీ ఏజెంట్లు మామూలుగా మాట్లాడినప్పటికీ ఆ తర్వాత మాత్రం వాళ్ళు ఇబ్బందికరమైన మాటలతో అలాగే వేధింపులకు కూడా గురిచేస్తారు. ఈ విధంగా మన దేశంలో క్రెడిట్ కార్డ్ వాడే చాలామందికి అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షురాలు సీనియర్ అడ్వకేట్ ఎర్ర రేవతి ఇటువంటి సందర్భాలనుంచి బయటపడేందుకు వినియోగదారులు న్యాయపరమైన సలహాలను తీసుకోవచ్చని అలాగే న్యాయపరమైన రక్షణ కూడా పొందవచ్చు అని అంటున్నారు.
ముందుగా మీరు క్రెడిట్ కార్డు వేధింపుల నుంచి ఉపశమనం పొందడానికి సీనియర్ సివిల్ లాయర్లను సంప్రదించాలి. ఒక పిటిషన్ వేసి వారం రోజుల్లో వాళ్లకు నోటీసు పంపించాలి. ఈ విధంగా చేయడం వలన వాళ్ళ వేధింపుల నుంచి బయటపడవచ్చు. ఈ విధంగా చేయడం వలన సిబిల్ స్కోర్ కూడా పడిపోదని అలాగే ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు అని అంటున్నారు. ఇటువంటి సందర్భాలలో కోర్టు ద్వారా పోలీసుల రక్షణ కూడా కోరవచ్చు అని అడ్వకేట్ రేవతి చెప్పుకొచ్చారు. ఇటువంటి వేధింపుల నుంచి బయటపడడానికి ఇటువంటి న్యాయపరమైన మార్గాలను వెతుక్కోవాలని ఆమె సూచించారు.