Home » సినిమా » Richa Gangopadhyay: అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మిర్చి సినిమా హీరోయిన్ రిచా!

Richa Gangopadhyay: అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మిర్చి సినిమా హీరోయిన్ రిచా!

Richa Gangopdhaya
Richa Gangopdhaya

Richa Gangopadhyay: రానా దగ్గుపాటి హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లీడర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయినా అమ్మాయి రిచా గంగోపాధ్యాయ.మొదటి సినిమాతోనే తన అందం తో అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది రిచా.ఆ తర్వాత తెలుగులో మిరపకాయ్,మిర్చి,భాయ్,సారొచ్చారు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.ప్రభాస్ నటించిన మిర్చి సినిమాతో రిచా గంగోపాధ్యాయ కు మంచి గుర్తింపు వచ్చింది.తెలుగుతో పాటు తమిళ్,బెంగాలీ లో కూడా పలు సినిమాలలో నటించింది ఈ అమ్మడు.సినిమా ఇండస్ట్రీలో కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే అమెరికా వెళ్ళిపోయింది.

అమెరికాలోనే జోలంగేళ్ల తో ప్రేమలో పడి పెద్దల అనుమతితో వివాహం కూడా చేసుకుంది ఈ అందాలా తార.రిచా గత సంవత్సరం మే నెలలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.రిచా కొడుకు పేరు లూకా షాన్ లాంగేళ్ల.ప్రస్తుతం ఫ్యామిలీతోనే ఫుల్ బిజీగా ఉంది రిచా గంగోపాధ్యాయ.అయితే రిచా 2013 లో నాగార్జున హీరోగా తెరకెక్కిన భాయ్ సినిమాలో చివరిసారిగా కనిపించింది.ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న రిచా సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

తన భర్త,కొడుకుతో ఉన్న ఫోటోలను రిచా సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.ఒక ఫంక్షన్లో తన భర్త,బిడ్డతో ఉన్న ఫ్యామిలీ ఫోటో ఒకటి ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.తల్లి అయినా తర్వాత కొంచెం బొద్దుగా ఉండడంతో ఆ ఫొటోలో రిచా ను గుర్తుపట్టడం కొంచెం కష్టమే అని చెప్పచ్చు.ఇప్పటికి కూడా ఎంతో అందంగా ఉన్న రిచా లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.బ్యూటీ ఫుల్ కపుల్ అంటూ నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Richa Langella (@richalangella)