తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన మొదటి సినిమాతోనే విజయం అందుకున్న వాళ్ళు చాల తక్కువ మందే ఉంటారు అని చెప్పచ్చు.అలంటి వాళ్లలో యువ దర్శకుడు వశిష్ట కూడా ఒకరు.ఇటీవలే వశిష్ట దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం బింబిసారా ఆగష్టు 5 వ తేదీన ప్రపంచవ్యాప్తం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించి ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంది.ఇక బింబిసారా సినిమా కోసం దర్శకుడు వశిష్ట బాగానే కష్టపడ్డారు అని తెలుస్తుంది.ఇక చివరకు ఈ సినిమా కోసం తన పేరును కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌంగ్ ఉన్న వాళ్ళకి ఒక పరిస్థితి..బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్ళకి ఒక పరిస్థితి ఉంటుంది.కానీ బ్యాక్ గ్రౌంగ్ అనేది ఒక బూస్టింగ్ మాత్రమే అంటూ బింబిసారా సినిమాతో నిరూపించారు దర్శకుడు వశిష్ట.ఇంతటి ఘనవిజయాన్ని సాధించిన బింబిసారా సినిమా కథ ముందు చాల మంది హీరోల దగ్గరకు వెళ్ళింది.ఇక ఈ సినిమా కథను మాస్ మహారాజ్ రవితేజ రెండు సార్లు కూడా విన్నారట.
అయితే కమర్షియల్ కథ తనకు సెట్ అవదు అని భావించి పైగా ఈ సినిమా కథ పై రవితేజ కు చాల డౌట్స్ ఉండడంతో చివరకు ఈ కథను కళ్యాణ్ రామ్ కు వినిపించారట దర్శకుడు.ఇక కథ నచ్చిన కళ్యాణ్ రామ్ నాకు పాత్రలు అంటే చాల ఇష్టం..నేను కూడా ఇలాంటి కథ కోసమే చూస్తున్నాను అని చెప్పారట.ఇక హిట్ అయినా ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా చరిత్ర సృష్టించిందని చెప్పచ్చు.అయితే ఈ సినిమాను రిజెక్ట్ చేసిన రవితేజ ఈ సినిమాను చేసి ఉంటె మరోలా ఉండేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.