Nail Cutting: వారంలో ఈ 4 రోజులలో గోర్లను పొరపాటున కూడా కత్తిరించకూడదు.. లేకపోతే పెద్ద సమస్యలు తప్పవు

Nail Cutting
Nail Cutting

Nail Cutting: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హిందూ మతంలో గోర్లను కత్తిరించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. గోర్లు ఏ రోజు కత్తిరించడం శుభప్రదం అలాగే గోర్లు ఏ రోజు కత్తిరించకూడదు అనే విషయంపై కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. వాస్తు శాస్త్రంలో మరియు జ్యోతిష్య శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించి అనేక నియమాలు చెప్పబడ్డాయి. కాబట్టి గోర్లు కత్తిరించడానికి కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. కేవలం రాత్రి సమయంలో మాత్రమే కాదు కొన్ని ప్రత్యేక రోజులలో కూడా గోర్లను కత్తిరించడం అశుభంగా చెప్తారు.

సూర్యాస్తమయం సమయంలో లేదా రాత్రి పూట గోర్లను ఎప్పటికీ కదిరించకూడదు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. రాత్రి సమయాలలో గోర్లను కత్తిరించడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి జీవితంలో అనేక సమస్యలు ఏర్పడతాయని నిపుణులు చెప్తున్నారు. మంగళవారం రోజున గోర్లను అస్సలు కత్తిరించకూడదు. ఈరోజు గోర్లు కత్తిరిస్తే ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. అలాగే గురువారం రోజున కూడా గోర్లను కత్తిరించకూడదు. ఈరోజున గోర్లు కత్తిరిస్తే వైవాహిక సంబంధాలలో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే శనివారం రోజున కూడా గోర్లు కత్తిరించకూడదు.

కొందరి జాతకంలో శని బలహీనంగా ఉంటుంది. ఇటువంటివారు శనివారం రోజున గోళ్లను కత్తిరిస్తే మానసిక లేదా శారీరక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఆదివారం రోజున కూడా గోర్లను కదిలిస్తే పనులలో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యం పై కూడా చెడు ప్రభావం కలుగుతుంది. సోమవారం రోజున జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోర్లు కత్తిరించడం చాలా మంచిది. బుధవారం కూడా గోర్లు కత్తిరించడం శుభప్రదంగా చెప్పారు. అలాగే శుక్రవారం రోజున గోర్లు కత్తిరించడం పవిత్రమైన రోజుగా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది.

ప్రభుత్వ పథకాలు,ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now