Gas Cylinder: ఎక్స్ పైరీ డేట్ దాటిన తర్వాత గ్యాస్ సిలిండర్ వాడడం ఎంత ప్రమాదమో తెలుసా.. వెంటనే ఇలా చెక్ చేసుకోండి

Gas Cylinder
Gas Cylinder

Gas Cylinder: మనలో చాలామందికి గ్యాస్ సిలిండర్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అని తెలియదు. కానీ ఎక్స్పైరీ అయిన గ్యాస్ సిలిండర్ను వాడడం చాలా ప్రమాదకరం. ఇటువంటివి వాడడం వలన లీకేజీ లేదా పేలుడు వంటి రిస్కులు కూడా జరిగే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ మధ్యకాలంలో గ్యాస్ సిలిండర్ ఉంటుంది. ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లపై ప్రత్యేకమైన రాయితీలు ఇస్తున్న క్రమంలో నిరుపేదలు కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే ప్రతిరోజు గ్యాస్ సిలిండర్ పై వంట చేస్తున్నవారు కొన్ని జాగ్రత్తలను తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా మీరు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ఎక్స్పైరీ డేట్ మీరు ముందుగానే తెలుసుకోవాలి. ఎక్స్పైరీ అయిన గ్యాస్ సిలిండర్లను మీరు డెలివరీ తీసుకోకూడదు. వాటిని ఉపయోగించడం కూడా చాలా ప్రమాదకరం.

ఎక్స్పైరీ అయిన గ్యాస్ సిలిండర్ వాడటం చాలా ప్రమాదకరం అని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా వీటివలన లీకేజీ లేదా పేలుడు వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ అంచనా వేసిన గణాంకాల ప్రకారం మనదేశంలో 2023లో గ్యాస్ లీకేజీ కారణంగా 1200 ప్రమాదాలు నమోదయాయని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిలిండర్ డెలివరీ తీసుకుంటున్న సమయంలో దానిపై ఉండే సీల్ మరియు వెయిట్ తో పాటు మీరు ఎక్స్పైరీ డేట్ కూడా చెక్ చేసుకోవాలి. ప్రతి ఐదు ఏళ్లకు ఒకసారి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిపోర్ట్ ప్రకారము గ్యాస్ సిలిండర్లను హైడ్రోస్టటిక్ టెస్ట్ చేస్తారు. సిలిండర్ల యొక్క బలం మరియు సేఫ్టీని ఈ టెస్ట్ నిర్ధారిస్తాయి. వీటిని ఆధారంగా చేసుకుని గ్యాస్ సిలిండర్ ఎక్స్పైరీ డేట్ ఫిక్స్ చేస్తారు. ప్రతి గ్యాస్ సిలిండర్ పై మూడు మెటల్స్ స్ట్రిప్ లు ఉంటాయి. వీటిని వాల్వును రక్షించే ప్రౌడ్ అని కూడా అంటారు.

ఈ మూడు స్ట్రిప్ లలో ఒక దాని లోపలి భాగంలో మీకు ఆ గ్యాస్ సిలిండర్ ఎక్స్పైరీ కోడ్ రాసి ఉంటుంది. ఒక ఆల్ఫాబెట్ తర్వాత రెండు అంకెలలో ఈ కోడ్ ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే b26. ఈ కోడ్ పెయింట్ తో ప్రతి సిలిండర్ పై రాసి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ కోడ్ సరిగ్గా కనిపించకపోతే మీరు సిలిండర్ డిస్ట్రిబ్యూట్ చేసిన వ్యక్తిని అడగాలి. ఈ కోడ్ లో ఉన్న ఆల్ఫాబెట్ ఆ సంవత్సరంలో క్వార్టర్ను సూచిస్తుంది. ఏ అంటే జనవరి నుంచి మార్చి, బి అంటే ఏప్రిల్ నుంచి జూన్, సి అంటే జులై నుంచి సెప్టెంబర్, డి అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్. ఆ తర్వాత ఈ రెండు అంకెలు సంవత్సరాన్ని సూచిస్తాయి. ఉదాహరణకు మీకు చెప్పాలంటే ఒక సిలిండర్ పై డి25 అని రాసి ఉంటే ఇది 2025 అక్టోబర్ డిసెంబర్లో టెస్టింగ్ కు వెళ్లాలి అని అర్థం. ఈ డేట్ దాటిన తర్వాత సిలిండర్ను వాడకూడదు. సిలిండర్ యొక్క లైఫ్ స్పాన్ 15 ఏళ్లు మాత్రమే ఉంటుంది.

ప్రభుత్వ పథకాలు,ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now