Bhagavanth Kesari : బాలయ్య తో కలిసి దంచవే మేనత్త కూతురా సాంగ్ కు కాజల్,శ్రీలీల మాస్ డాన్స్…వీడియో వైరల్

Bhagavanth Kesari

Bhagavanth Kesari : రీసెంట్ గా బాలకృష్ణ హీరో గా నటించిన భగవంత్ కేసరి సినిమాలో దంచవే మేనత్త సాంగ్ ను షూట్ చేసి ఆ సాంగ్ లేకుండానే సినిమాను రిలీజ్ చేసారు.అయితే సినిమా హిట్ అయినా వారం రోజుల తర్వాత థియేటర్స్ లో ఈ సాంగ్ ను జత చేస్తామన్నారు.అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలకృష్ణ హీరో గా నటించిన లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే ఈ సినిమా 120 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఘనవిజయం సాధించింది.ఈ సినిమాలో మంచి మెసేజ్ తో పాటు ఎమోషన్ ఉండడంతో ఈ సినిమా బాగా రీచ్ అయ్యింది.

ఇక ఈ సినిమా లో బాలయ్య మాస్ యాక్షన్ ఓ రేంజ్ లో ఉందని చెప్పచ్చు.ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ సక్సెస్ టూర్ లో బిజీ గా ఉన్నారు.ఇక ఈ సినిమాలో దంచవే మేనత్త కూతురా అనే సాంగ్ ను షూట్ చేసి ఈ సాంగ్ లేకుండానే సినిమాను రిలీజ్ చేసారు చిత్ర యూనిట్.సినిమా విడుదల అయినా వారం రోజుల తర్వాత ఈ సాంగ్ ను జత చేస్తామన్నారు.అయితే తాజాగా ఈ సాంగ్ ను థియేటర్స్ లో జత చేసారు.దంచవే మేనత్త కూతురా సాంగ్ బాలకృష్ణ కెరీర్ లో సూపర్ హిట్ అయినా సాంగ్స్ లో ఒకటి.ఇక ఈ సాంగ్ ను రీమేక్ చేయడంతో ఈ సాంగ్ ను చూసేందుకు అభిమానులు మరోసారి థియేటర్స్ కు క్యూట్ కడుతున్నారు.సినిమా చివరలో ఈ పాటను అభిమానుల కోసం ప్రత్యేకంగా యాడ్ చేసినట్లు తెలుస్తుంది.ఈ సాంగ్ లో బాలయ్య,కాజల్ మాస్ స్టెప్పులతో అలరించారు.శ్రీలీల కూడా వీరితో కలిసి డాన్స్ చేసింది.కాజల్,శ్రీలీల కలిసి హాఫ్ సారీ లో ఈ డాన్స్ చేస్తే థియేటర్లలో ఈలలు వినిపించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *