కాబోయే అల్లుడి కోసం 125 వంటకాలతో విందు ఇచ్చిన అత్తింటి వాళ్ళు…మెనూ చూస్తే షాక్ అవ్వాల్సిందే…

తెలుగు సంప్రదాయాల గురించి అందరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పండుగలు శుభకార్యాలు వంటివి ఘనంగా చేయడంలో తెలుగు వారు ఎప్పుడు వెనక్కు తగ్గరు.ఇక దసరా,సంక్రాంతి వంటి పండుగలకు కొత్త అల్లుళ్లు అత్తారింటికి వెళ్లండం జరుగుతుంది.అలా వచ్చిన కొత్త అల్లుళ్లను అత్తా మామలు మర్యాదలు చేస్తుంటారు.ఇక ఆ మర్యాదలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కొత్త అల్లుళ్లకు చేసే మర్యాదలతో విందులో స్పెషల్ ఐటమ్స్ కూడా ఒకటి.ఇక మరి ముఖ్యంగా ఏపీ లో అత్తింటి వాళ్ళు అల్లుళ్ళ కోసం తయారు చేసి విందు మెనూ గురించి రెండు తెలుగు రాష్ట్రాలలోను మారుమోగాల్సిందే.

Advertisement

ఈ క్రమంలోనే పండుగా సందర్భంగా తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన ఒక కుటుంబం కోబోయే అల్లుడి కోసం కళ్లుచెదిరే విందును ఏర్పాటు చేసారు.ఈ దసరాకు కోబోయే అల్లుడిని ఇంటికి పిలిచి 125 రకాల వంటకాలతో అదిరిపోయే విందును ఏర్పాటు చేసారు.ఎస్ కోటకు చెందిన కాపుగంటి రామకృష్ణ,సుబ్బలక్ష్మి దంపతుల కుమారుడు అయినా చైతన్య కు విశాఖ కు చెందిన కలగర్ల శ్రీనివాసరావు,ధనలక్ష్మి దంపతుల కూతురు అయినా నిహారిక తో వివాహం జరిపించడానికి నిశ్చయించారు పెద్దలు.

ఇక ఈ జంటకు వచ్చే సంవత్సరం మార్చ్ 9 న పెళ్లి ముహూర్తం నిర్ణయించారు.ఈ జంటకు వివాహం నిశ్చయించిన తర్వాత తోలి పండుగా కావడంతో అత్తవారు అల్లుడిని ఆహ్వానించారు.పండుగకు స్పెషల్ గా వంటలను ఏర్పాటు చేసారు.ఇక ఇందులో 95 రకాల వంటలను బయట నుంచి కొనుగోలు చేసారు.ఇక మిగిలినవి ఇంట్లోనే తయారు చేసారు.అన్ని వంటకాలను ఒకేసారి చూసిన అల్లుడు ఆశ్చర్యపోయాడు.మొత్తానికి కాబోయే అల్లుడి కోసం అత్తింటివాళ్ళు పండుగా ట్రీట్ ఒక రేంజ్ లో ఇచ్చి సర్ప్రైజ్ చేసారని చెప్పచ్చు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *