Mehreen Pirzada: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో చాల మంది స్టార్ హీరో హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇప్పుడు ప్రస్తుతం ఒక స్టార్ హీరోయిన్ చిన్ననాటి క్యూట్ ఫోటో ఒకటి నెట్టింట్లో అందరిని బాగా ఆకట్టుకుంటుంది.సైకిల్ తొక్కుతూ క్యూట్ గా ఉన్న చిన్నారిని చూస్తే పాల రాతి బొమ్మ గుర్తొస్తుంది అని చెప్పచ్చు.ఈమెను పెళ్లి చేసుకున్న వాడు అదృష్టవంతుడు అని అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తూ ఉంటారు.ఈమెకు ఇప్పటికే పెళ్లి జరిగిపోవాల్సింది కానీ కొన్ని కారణాల వలన ఆ పెళ్లి ఆగిపోవడం జరిగింది.
ప్రస్తుతం ఈమె రెండు సినిమాలతో బిజీ గా ఉంది.సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడుకు బాగానే క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఉన్నాయి.సైకిల్ తొక్కుతూ ఉన్న చిన్నారి ఎవరో కాదు హీరోయిన్ మెహ్రిన్.పంజాబ్ లో పుట్టి పెరిగిన మెహ్రిన్ పది సంవత్సరాల వయస్సులోనే రాంప్ వాక్ చేసి బ్యూటీ పిజెంట్ టైటిల్ ను గెలుచుకోవడం జరిగింది.మెహ్రిన్ 2013 లో మిస్ సౌత్ ఆసియ కెనడా పర్సనాలిటీ గా గెలుపొందింది.
ఆ తర్వాత పలు ప్రముఖ బ్రాండ్లలో మరియు యాడ్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.మోడలింగ్ రంగంలో బిజీ గా ఉన్న సమయంలోనే మెహ్రిన్ కు కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాలో హీరోయిన్ గ అవకాశం వచ్చింది.ఈ సినిమాతో నటనలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు ఆ తర్వాత అవకాశాలు క్యూ కట్టాయి.తెలుగులో పలు హిట్ సినిమాలు సొంతం చేసుకుంది మెహ్రిన్.ప్రస్తుతం మెహ్రిన్ స్పార్క్ అనే తెలుగు తమిళ సినిమాలో మరియు నీ సిగ్గువరేగు అనే కన్నడ సినిమాలో నటిస్తుందని సమాచారం.