తమ అభియాన్ హీరోతో పాటు సీనియర్ అభిమాని హీరో కూడా వెండితెరను పంచుకుంటే ఆ ప్రేక్షకులకు ఉండే కిక్కే వేరు. తన నటనా వారసత్వంతో కలిసి నటించే అవకాశాన్ని ఏ సీనియర్ నాయకుడు కూడా వదులుకోడు అలాంటి వారి కాంబినేషన్ ఇక్కడ చూద్దాం.
ఎన్టీఆర్-బాలకృష్ణ
నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) తెలువని సినీ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన తెలుగు ఇండస్ర్టీని ఏలారు. రాజకీయంలో కూడా మంచి రోల్ పోషించారు ఆయన. ఆయన వారసుడు యువరత్న బాలక్రిష్ణ. బాలక్రిష్ణ తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించారు. తాతమ్మకల, దాన వీర శూర కర్ణ, రామ్ రహీంలో వీరు ఇద్దరూ ప్రేక్షకులను అలరించారు. బాలయ్య బాబు సినిమాలో కూడా ఎన్టీఆర్ కొన్ని పాత్రలు చేశారు.

మోహన్ బాబు-మంచు మనోజ్
మోహన్ బాబు వారసత్వంలో ఇద్దరు కొడుకులు, కూతురు ఇండస్ట్రీకి వచ్చారు. కూతురు నటనతో పాటు నిర్మాణ రంగం, దర్శకత్వంలో ప్రతిభ చూపితే కొడుకులు హీరోలుగా రాణించారు. తన చిన్న కొడుకు మంచు మనోజ్ తో కలిసి మోహన్ బాబు కొన్ని చిత్రాల్లో నటించారు. అందులో పాండవులు పాండవులు తుమ్మెద, ఝుమ్మంది నాదం తదితర మూవీస్ ఉన్నాయి.

మోహన్ బాబు-మంచు విష్ణు
మంచి విష్ణు మోహన్ బాబు పెద్ద కొడుకు పలు చిత్రాల్లో వీరు కలిసి నటించారు. రౌడీ, గేమ్, పాండవులు పాండవులు తుమ్మెదలో వీరి కాంబో మంచిగా పండింది. ఆడియన్స్ ను కూడా బాగా ఆకట్టుకుంది.

నాగేశ్వర్ రావు-నాగార్జున
అక్కినేని నాగేశ్వర్ రావు కొడుకు నాగార్జున వీరి కాంబినేషన్ లో చాలా సినిమాలే వచ్చాయి. మంచి డ్రామా, లవ్, ఎమోషన్ తదితర భిన్న చిత్రాల్లో వీరి కాంబో పర్ఫెక్ట్ గా ఉంటుంది. కలెక్టర్ గారి అబ్బాయి శ్రీరామదాసు అగ్నిపుత్రుడు మనం వీరి కాంబోలో చెప్పుకోదగ్గ మూవీస్.

కృష్ణంరాజు-ప్రభాస్
కృష్ణంరాజు వారసత్వాన్ని ఇండస్ట్రీలోకి తీసుకెళ్లేందుకు తన అన్న కొడుకు ప్రభాస్ వెండితెరకు వచ్చారు. ప్రభాస్ తో కలిసి కృష్ణంరాజు కొన్ని సినిమాల్లో నటించారు. వాటిలో బిల్లా, రెబల్, రాదేశ్యం ఉన్నాయి. వీరి కాంబో హైలట్ గా నిలిచింది.

చిరంజీవి-రామ్ చరణ్
చిరంజీవికి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన కొడుకు రామ్ చరణ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ హీరోల్లో ఒకరు. వీరిద్దరి కాంబినేషన్లో బ్రూస్ లీ మూవీ వచ్చింది. దీంతో పాటు ఆచార్య సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో నటించారు.

కృష్ణ-మహేష్ బాబు
నిన్నటి తరం కృష్ణకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ అభిమానం ఈ తరం వరకు కూడా కొనసాగుతుంది అనడంలో సందేహం లేదు. ఆయన వారసత్వంగా రమేశ్ బాబు, మహేష్ బాబు వెండితెరపైకి వచ్చారు. కానీ రమేశ్ బాబుకు అనుకున్నంతగా సినిమా అవకాశాలు రాలేదు. కానీ మహేశ్ బాబు మాత్రం చాలా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు చాలావరకు కూడా బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇక కృష్ణ-మహేశ్ కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ విషయానికి వస్తే కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, బజార్ రౌడీ. తదిత చిత్రాల్లో తండ్రితో కలిపి కొడుకు మహేష్ బాబు నటించారు.
