బుల్లితెర మీద ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 చూస్తూ చూస్తూనే పదమూడు వారలు పూర్తి చేసుకొని ఫినాలే కి దగ్గరలో ఉంది.అయితే బిగ్ బాస్ షో లో అడుగు పెట్టిన వాళ్లలో ప్రియాంక సింగ్ రెండో ట్రాన్స్ జెండర్.ఇదివరకే మూడో సీజన్ లో ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి అడుగు పెట్టిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ సీజన్ లో ప్రియాంక సింగ్ కూడా బాగానే రాణించింది అని చెప్పాలి.
కానీ గేమ్ మీద కాకుండా ఇతర విషయాల మీద దృష్టి పెట్టడంతోప్రియాంక సింగ్ టాప్ ఫైవ్ లో అడుగు పెట్టలేదు అని వార్తలు వస్తున్నాయి.ఈ బిగ్ బాస్ సీజన్ 5 లో పదమూడో వారంలో ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయ్యింది.అయితే ఈసారి అయినా ట్రాన్స్ జెండర్ ఫినాలే వరకు వెళ్తుందని భావించగా ఆమె ఇలా ఎలిమినేట్ అవడంతో చాల మంది నిరాశ చెందారు.ఇప్పుడు ప్రియాంక సింగ్ బిగ్ బాస్ పారితోషకం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
అయితే వారానికి రూ.1 .75 నుంచి రూ.2 లక్షలు పారితోషకం ప్రియాంక సింగ్ తీసుకున్నట్లు సమాచారం.దింతో ఈ పదమూడు వారాలకు రూ.25 లక్షలు ప్రియాంక సింగ్ పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఒకవైపు ఆమెకు నిజంగానే అంత పారితోషకం ఉంటుందా అని కొంత మంది అనుమానాలు వ్యక్తం చేసిన కూడా..నిజం అయితే చాల మంది ట్రాన్స్ జెండర్ లకు ప్రియాంక సింగ్ స్ఫూర్తిగా నిలిచే అవకాశం ఉంది.