సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సెలెబ్రెటీలు,సినిమా తారలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు,వాటి తాలూకా వివరాలు,వీడియోలు వంటివి వైరల్ అవుతూ ఉన్నాయి.ఈ క్రమంలో అన్ని రంగాలకు చెందిన సెలెబ్రెటీల ఫోటోలు వీడియోలు ప్రతి రోజు వైరల్ అవుతూనే ఉన్నాయి.ముఖ్యంగా సినిమా తారలకు సంబంధించిన పాత ఫోటోలు మరియు వీడియోలు వంటివి వైరల్ అవుతున్న క్రమంలో అభిమానులు కూడా వాటిని చూసేందుకు చాల ఆసక్తి చూపిస్తారు.ప్రస్తుతం ఇదే క్రమంలో ఇద్దరు స్టార్ హీరోలకు చెందిన పాత ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఇద్దరు స్టార్ హీరోలు కాలేజ్ చదువుతున్నప్పటి ఫోటో ఒకటి నెట్టింట్లో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు తమిళ స్టార్లు అయినా సూర్య మరియు విశాల్.ఏదో ఫంక్షన్ లో వీరిద్దరూ తమ స్నేహితులతో కలిసి కూర్చొని ఉండడం ఫొటోలో గమనించవచ్చు.ఈ ఇద్దరు స్టార్ హీరోలు తమ స్నేహితులతో కలిసి ఫొటోకు ఫోజులిచ్చారు.ప్రముఖ సీనియర్ హీరో అయినా శివకుమార్ కుమారుడు హీరో సూర్య అన్న సంగతి అందరికి తెలిసిందే.
నేరుక్కు నేర్ అనే సినిమాతో సూర్య ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు.గజినీ సినిమాతో సూర్య తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం సూర్య వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు.హీరో విశాల్ ప్రముఖ బిజినెస్ మ్యాన్ మరియు సినిమా నిర్మాత అయినా జికె రెడ్డి కుమారుడు.అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సినిమా కెరీర్ ను స్టార్ట్ చేసిన విశాల్ ఆ తర్వాత చెల్లమే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.పందెం కోడి సినిమాతో హీరో విశాల్ తెలుగులో కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.