Ram Pothineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని ఎనర్జిటిక్ స్టార్ గా ఎదిగిన రామ్ పోతినేని గురించి అందరికి తెలిసిందే.రామ్ తన వైవిధ్యమైన సినిమాలతో అందరు హీరోల అభిమానులను ఆకట్టుకుంటారు.రామ్ సినిమాలకు మినిమం గ్యారంటీ ఉంటుంది అంటూ నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్ లు కూడా నమ్ముతారు.అందుకే రామ్ సినిమా విడుదల అవుతుంది అంటే నిర్మాతలు చెప్పిన రేటు కు కొనేస్తుంటారు.టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఉన్న హీరోలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరు అంటే అందరు చెప్పే పేరు ప్రభాస్.
ఇక ప్రభాస్ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా అందరికి గుర్తొచ్చే మరో పేరు రామ్ పోతినేని అని చెప్పచ్చు.హీరో రామ్ కు తమ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలనీ చాల ప్రయత్నాలు చేస్తున్న కూడా రామ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఒక హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.హీరో రామ్ అనుపమ పరమేశ్వరన్ ను ప్రేమిస్తున్నాడని ఆమెతో అన్ని సెట్ అయినా తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులను ఒప్పించినా తర్వాత బయట ప్రపంచానికి చెప్పాలనే ఆలోచనలో రామ్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక తన హీరోయిజం తో ప్రత్యేక క్రేజ్ ను సంపాదించుకున్న రామ్ తన ప్రేమకు కూడా క్రేజీ హీరోయిన్ ను ఎంపిక చేసుకున్నాడు అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.రామ్,అనుపమ కలిసి హలో గురు ప్రేమ కోసమే అనే సినిమాలో నటించారు.ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.బయట కూడా రామ్,అనుపమ మంచి స్నేహితులు లాగా ఉంటారు.ఇక ఇటీవలే ఎంగేజ్మెంట్ జరుపుకున్న వరుణ్,లావణ్య కూడా ఇంట్లో వాళ్ళను ఒప్పించినా తర్వాత బయట ప్రపంచానికి తెలియజేసారని ఇక ఇదే బాటలో రామ్,అనుపమ కూడా ఇంట్లో వాళ్ళను ఒప్పించే ప్రయత్నం లో ఉన్నారని టాక్.ఇక ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.