రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఈ 8 మంది స్టార్ హీరోలు చేసిన సినిమాలు యేవో తెలుసా…

సినిమా ఇండస్ట్రీలో చాల మంది హీరో హీరోయిన్లు సినిమా రిలీజ్ అవడానికి ముందే రెమ్యూనరేషన్ తీసుకుంటారు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా చాల మంది స్టార్ హీరో హీరోయిన్లు ముందే పారితోషకం తీసుకుంటారు.కానీ ఈ మధ్య కాలంలో చాల మంది స్టార్ హీరోలు లాభాలలో వాటాలు తీసుకుంటున్నారు.

మహేష్ బాబు:శ్రీమంతుడు సినిమాతో మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి మొదటిసారిగా లాభాలను తీసుకున్నారు.

ప్రభాస్:బాహుబలి సినిమాకు ప్రభాస్ ఎలాంటి పరిహారం తీసుకోలేదు.25 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వాలని నిర్మాతలు ముందుగా నిర్ణయించుకున్నారు.600 కోట్లకు పైగా సినిమా వసూలు చేయడంతో ప్రభాస్ 25 కోట్లు పరిహారం అందుకోవడం జరిగింది.ప్రభాస్ బాహుబలి 2 కు కూడా లాభాలలో డీసెంట్ పర్సెంటేజ్ తీసుకోవడం జరిగింది.

రామ్ చరణ్:రామ్ చరణ్ ఒక్కో సినిమాకు గాను 12 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటారు.కానీ అల్లు అరవింద్ నిర్మించిన ధృవ చిత్రంకు ఎటువంటి పారితోషకం తీసుకోలేదు.

పవన్ కళ్యాణ్:సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంతో తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు పవన్ కళ్యాణ్.అప్పటి నుంచి తన చిత్రాలకు లాభాలలో వాటాను తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్.గబ్బర్ సింగ్,కాటమరాయుడు చిత్రాలకు తన వాటాగా 30 కోట్లు తీసుకోవడం జరిగింది.

వెంకటేష్:వెంకటేష్ బాబు బంగారం,గురు చిత్రాలతో వచ్చిన లాభాలలో కొంత వాటాను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

నాగార్జున:నాగార్జున సొంతంగా నిర్మించిన మనం,సోగ్గాడే చిన్నినాయనా చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినా సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమాలకు నాగార్జున లాభాలలో వాటాను తీసుకోవడం జరిగింది.

చిరంజీవి:తన ఫ్యామిలీ ప్రొడక్షన్స్ అయినా గీత ఆర్ట్స్,అంజనా ప్రొడక్షన్స్ లో చిరంజీవి రెమ్యూనరేషన్ తీసుకునే వారు.కొణిదెల ప్రొడక్షన్స్ లో నిర్మించిన ఖైదీ నెంబర్ 150 లో లాభాలలో వాటాను తీసుకోవడం జరిగింది.

జూనియర్ ఎన్టీఆర్:ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మించిన జై లవకుశ చిత్రంకు ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదు.ఆ తర్వాత వచ్చిన లాభాలలో కొంత శాతం వాటాను తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *