Home సినిమా Samantha: ఆ పని చేసి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చిన సమంత

Samantha: ఆ పని చేసి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చిన సమంత

0
Samantha
Samantha

Samantha: సమంత,నాగ చైతన్య మళ్ళి కలుస్తున్నారు అంటూ గత కొన్ని రోజుల నుంచి కొన్ని వార్తలు సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో వైరల్ అయ్యాయి.దీనికి ముఖ్య కారణం ఏంటంటే సమంత దగ్గర ఉండే పెట్ డాగ్ హాష్ నాగ చైతన్య దగ్గర కనిపించటంతో వీరిద్దరూ త్వరలో కలవబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి.వీటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.నాగ చైతన్య అభిమానులతో పాటు సమంత అభిమానులు కూడా ఆ వార్తలు నిజమే ఆ లవ్లీ కపుల్ మళ్ళి కలవబోతున్నారు అంటూ హ్యాపీ ఫీల్ అయ్యారు.

అయితే ఆ ఆనందం పై సమంత నీళ్లు చల్లింది అని చెప్పచ్చు.టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ జంట నాగ చైతన్య సమంత.వీరిద్దరూ విడిపోయి విడాకులు తీసుకోని రెండేళ్లు అవుతుంది.పదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ వ్యక్తిగత కారణాలతో విడిపోయారు.టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వీరిద్దకు విడిపోవడాన్ని ఇంకా చాల మంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

వీరిద్దరూ మళ్ళి కలిసిపోతే బాగుంటుంది అని అనుకునే అభిమానులు కూడా చాలా మందే ఉన్నారు.ఇక మధ్య కాలం లో సమంత దగ్గర ఉండే పెట్ డాగ్ హాష్ నాగ చైతన్య దగ్గర కనిపించటం వాటికీ సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడం తో వీరిద్దరూ మళ్ళి త్వరలోనే కలవబోతున్నారు అంటూ కొన్ని వార్తలు ఊపందుకున్నాయి.వీరిద్దరి అభిమానులు కూడా హ్యాపీ గా ఫీల్ అయ్యారు.సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే సమంత తన ప్రొఫెషనల్ విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంది.

తాజాగా పింక్ డ్రెస్ లో సమంత షేర్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.గతంలో సమంత షేర్ చేసిన కొన్ని ఫోటోలలో ఆమె శరీరంపై చైతు పచ్చ బొట్టు ఉండేది.కానీ తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలలో ఆ టాటూ కనిపించటం లేదు.అయితే నిజంగానే సమంత ఆ టాటూ ను తొలగించిందా లేదా కనిపించకుండా జాగ్రత్త పడిందా.వీళ్ళద్దరు మళ్ళి కలుస్తారని అనుకున్న సమయంలో సమంత షేర్ చేసిన ఈ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here