నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం అఖండ ఇటీవలే రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల పంట పండిస్తోంది.ఈ చిత్రం లో బాలకృష్ణ అఘోర పాత్రలో తన విశ్వరూపాన్ని చూపించారు.ఈరోజుతో ఈ చిత్రం రూ.50 కోట్ల షేర్లను అధిగమించుతుంది.ఏపీ టికెట్ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ మార్క్ సాధించటం విశేషం.ఆ తర్వాత ఈ చిత్రం ఫుల్ రన్ లో రూ.70 కోట్ల వరకు వసూళ్లు రాబడుతుందని సినిమా పండితులు అంచనా వేశారు.
టికెట్ రేట్ లతో సంబంధం లేకుండా అఖండ కలెక్షన్ల వర్షం కురిపిస్తుండడంతో పెద్ద సినిమాలు కూడా టికెట్ ల ఇష్యు గురించి భయపడకుండా విడుదలకు సిద్ధం అవుతున్నాయి.రెండు తెలుగు రాష్ట్రాలలోను మరియు ఓవర్సీస్ లోను కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న అఖండ చిత్రం డిజిటల్ రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అనే దానిపై ఇప్పుడు అందరిలోనూ బాగా ఆసక్తి నెలకొంది.అయితే అగ్రిమెంట్ ప్రకారం సినిమా రిలీజ్ అయినా 30 రోజుల తర్వాత ఓటిటి లో రిలీజ్ చేసుకోవచ్చు అనే వార్తలు వస్తున్నాయి.
అయితే జనవరి 1 లేదా 2 న అఖండ చిత్రం ఓటిటి లో రిలీజ్ అవుతుంది.అఖండ చిత్రానికి ఓటిటి రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది.ఈ నెల డిసెంబర్ చివరిలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.ఓటిటి లో రిలీజ్ అయినా తర్వాత ఈ చిత్రం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతూ మాస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.ఈ చిత్రానికి తమన్ అందించిన మ్యూజిక్ వేరే లెవెల్ లో ఉందని చెప్పచ్చు.ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్య జైస్వాల్ నటించారు.