Home సినిమా Jr Ntr: ఎన్టీఆర్ తో ఉన్నా ఈ చిన్నారి ఎవరో తెలుసా

Jr Ntr: ఎన్టీఆర్ తో ఉన్నా ఈ చిన్నారి ఎవరో తెలుసా

0
Jr NTR
Jr NTR

Jr Ntr: ప్రస్తుతం ఎన్టీఆర్,కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే.క్షణం తీరిక లేకుండా సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నా కూడా ఎన్టీఆర్ తనకు ఇష్టమైన వాళ్ళ కోసం సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు.ఈ క్రమం లోనే ఎన్టీఆర్ తన ఫ్యామిలీ తో కలిసి ఇటీవలే విదేశాలకు వెళ్లి వచ్చారు.ఒక పక్క సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నా కూడా ఎన్టీఆర్ తన భార్య,పిల్లల కోసం సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఎంతో ఆప్యాయంగా ఒక చిన్నారిని దగ్గరకు తీసుకున్న ఫోటో ఒకటి నెట్టింట్లో అందరిని ఆకట్టుకుంటుంది.

ఎన్టీఆర్ ఆ చిన్నారిని ఎంతో ప్రేమగా తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు.దాంతో ఈ చిన్నారి ఎవరు అనే దానిపై సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు నెటిజన్లు.ఈ ఫోటోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్.ఆ చిన్నారి తన మేనకోడలు అంటూ తెలిపారు ఆటో రాంప్రసాద్.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోకు కామెంట్ల మోత మోగిస్తున్నారు నెటిజన్లు.ఇది ఇలా ఉంటె ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు.ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపును సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్.ట్రిపుల్ ఆర్ బిగ్గెస్ట్ హిట్ తర్వాత మల్లి అంతే జోష్ తో దేవర సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు ఎన్టీఆర్.

ఇక ఈ సినిమా తో బాలీవుడ్ ముద్దు గుమ్మా జాహ్నవి కపూర్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కానుంది.ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో స్టార్ట్ అయినా ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది.కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి వస్తున్నా ఒక్కో అప్ డేట్ ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది.కొరటాల శివ భారీ యాక్షన్ సన్నివేశల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.ఎన్టీఆర్ కూడా ఈ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ తిరుకుంటున్నారు.ఇక ఈ సినిమాలో పూర్తిగా నీటిలోనే జరిగే యాక్షన్ సన్నివేశం సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని టాక్.వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన భారీ ఎత్తున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here