March 26, 2023

మనసంతా నువ్వే చిన్నారి ఇప్పుడు యెంత అందంగా మారిపోయిందో తెలుసా…ఇప్పుడు ఎక్కడుందో..ఏం చేస్తుందో తెలుసా…

manasantha nuvve movie child artist

తెలుగులో హీరో ఉదయ్ కిరణ్,రీమాసేన్ జంటగా నటించిన మనసంతా నువ్వే చిత్రం ప్రేక్షకులకు ఇప్పటికి బాగా గుర్తుండే ఉంటుంది.ఉదయ్ కిరణ్ సినిమా కెరీర్ లో రెండవ చిత్రంగా వచ్చిన మనసంతా నువ్వే చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఈ చిత్రం తర్వాత ఉదయ్ కిరణ్ వరుస అవకాశాలు క్యూ కట్టాయని చెప్పచ్చు.

ఉదయ్ కిరణ్ మరియు రీమా సేన్ చిన్ననాటి పాత్రలలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా అద్భుతం గా నటించారు అని చెప్పచ్చు.చాల మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా ఒకటి రెండు సినిమాలే చేసిన కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటారు.అలా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోయే చైల్డ్ ఆర్టిస్టులతో సుహాని కూడా ఒకరు అని చెప్పచ్చు.సుహాని మనసంతా నువ్వే చిత్రంలో రీమాసేన్ చిన్ననాటి పాత్రలో నటించడం జరిగింది.తూనీగ తూనీగా అనే పాటలో సుహాని ఎక్సప్రెషన్స్ ప్రేక్షకులకు ఇప్పటికి బాగా గుర్తుండే ఉంటాయి.

manasantha nuvve child artist Suhani Kalita
manasantha nuvve child artist Suhani Kalita

అప్పట్లో ఈ సినిమాలో సుహాని హెయిర్ స్టైల్ చూసి తల్లితండ్రులు తమ చిన్నారులకు కూడా అలాంటి హెయిర్ స్టైల్ చేయించడానికి ఇష్టపడేవారు.అయితే తనకు 20 ఏళ్ళు దాటినా తర్వాత కూడా సుహాని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.2008 సంవత్సరంలో రిలీజ్ అయినా సవాల్ అనే చిత్రంతో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది సుహాని.కానీ ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.

manasantha nuvve child artist Suhani Kalita
manasantha nuvve child artist Suhani Kalita

ఆ తర్వాత స్నేహ గీతం అనే సినిమాలో నటించిన కూడా మంచి గుర్తింపు దక్కించుకోలేకపోయింది.ఆ తర్వాత సినిమాలకు దూరం అయిపొయింది సుహాని.ఇటీవలే సుహానికి మోటివేషనల్ స్పీకర్ విభర్ హాసిజాతో నిశ్చితార్ధం జరిగింది.ప్రస్తుతం వీరిద్దరి నిశ్చితార్ధం ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలకు అభిమానులు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

manasantha nuvve child artist Suhani Kalita
manasantha nuvve child artist Suhani Kalita

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *