హిట్టయిన పాటకు స్టెప్పులేయడం సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు జరుగుతూనే ఉంటుంది. ఈ కోవలోకే వచ్చింది దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ (RRR) ఈ చిత్రంలోని సాంగ్. ఈ పాటలకు ఎంత క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. సినిమా సైతం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు చేస్తూ దూసుకుపోతోంది. రీసెంట్ గా ఈ మూవీని జపాన్ లో కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
ఈ మూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. రాజమౌళి అంటేనే భారీ అంచనాలు, చెట్టింగులు, ఆకట్టుకునే కథతో మంచి సినిమాటో గ్రఫీ ఉంటుంది. తెలుగు భాష నుంచి విడుదలైన ఈ చిత్రం ప్రపంచ దృష్టిని తన వైపు మళ్లించుకుంది. బాక్సాఫీస్ ను సైతం షేక్ చేసిందనడంలో సందేహం లేదు. జపాన్ లో థియేటికల్ రిలీజ్ కు చిత్ర యూనిట్ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కుటుంబ సభ్యులతో సహా అక్కడికి వెళ్లి జపనీయులను అలరించారు. దేశ వ్యాప్తంగా కూడా అత్యధిక వ్యూవ్స్ తో దూసుకుపోయిన ఈ సినిమా సాంగ్స్ కూడా అదే రేంజ్ లో హిట్ కొట్టాయి.

ట్రిపుల్ ఆర్ చిత్రంలోని ‘నాటు.. నాటు.. నాటు.. నాటు.. ఊర నాటు..’ అంటూ వచ్చే సాంగ్ కు స్టెప్పులేస్తున్నారు. మూవీ రిలీజై ఏడు నెలలైనా సాంగ్ కు ఏ మాత్రం క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ పాట స్టెప్స్ ఎంత వైరల్ అవుతున్నాయో చెప్పక్కర్లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా సాంగ్ సిగ్నేచర్ స్టెప్పులేస్తున్నారు.
రీసెంట్ గా ‘ఓరి దేవుడా’ చిత్ర యూనిట్ సక్సెస్ వేడుకలు చేసుకుంది. ఈ మూవీలో విశ్వక్ సేన్ హీరోగా నటించారు. దీపావళికి కానుకగా 21 అక్టోబర్ 2022న ఇది థియేటికల్ రిలీజ్ అయ్యింది. ఇందులో హీరోయిన్స్‌గా మిథాలా పార్కర్, ఆశా భట్ నటించారు. ఇటీవల జరిగిన సక్సెస్ ఈవెంట్ లో మిథాలా, ఆశా ట్రిపుట్ ఆర్ లోని నాటు సాంగ్ సిగ్నేచర్ స్టెప్పులేశారు. ఈ వీడియోను మిథాలా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ‘నాటు.. నాటు.. విత్ మై పార్టనర్ ఇన్ క్రైమ్..’ అంటూ క్యాప్షన్ ను జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.