Home సినిమా ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో జపానీస్ భాషలో ఎన్టీఆర్ యెంత బాగా మాట్లాడారో…వీడియొ చూస్తే...

ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో జపానీస్ భాషలో ఎన్టీఆర్ యెంత బాగా మాట్లాడారో…వీడియొ చూస్తే ఆశ్చర్యపోతారు…

0

ఇప్పుడు మన సినిమాలు ప్రపంచాన్ని చుట్టస్తున్నాయి. ఒక ప్రాంతీయ భాష సినిమాలేంటి ప్రపంచం ఏంటి అనుకుంటున్నారా.. అవును మరి బాహుబలి లాంటి అద్భుత ఖండాలు ప్రపంచంలోని చాలా దేశాల్లో అద్భుతంగా ప్రదర్శించడం ఒకెత్తయితే అక్కడి వారితో ఆహా అనిపించడం మరో ఎత్తు. ఇక అందులోని నటులకు కూడా అక్కడ ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడి అభిమానులను అలరించినట్టుగానే అక్కడి వారిని అక్కున చేర్చుకోవడంలో మన వారు సక్సెస్ అవుతున్నారనే చెప్పాలి. ఇలాంటి ఘటనే ఇప్పుడు జపానల్ లో జరిగింది.

టాలీవుడ్ హీరోల మార్కెట్ విస్తరిస్తుండడంతో మూవీ ప్రమోషన్, హాలిడే ట్రిప్స్ ఇతరత్రా వాటికోసం మన వారు విదేశాలకు వెళ్తూనే ఉంటారు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే రాజమౌళి దర్శకత్వంలో జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్ ప్రధానంగా నటించిన ట్రిపుల్ ఆర్ (RRR రౌద్రం, రణం, రుదిరం) గురువారం (21 అక్టోబర్, 2022)న జపాన్ లో విడుదలైంది. వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడా అని అక్కడి ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూడడం విశేషం. ఈ చిత్రం అక్కడ రిలీజ్ లో భాగంగా చిత్ర యూనిట్ అక్కడికి వెళ్లింది. ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్ కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్లారు. 

ఇక జపాన్ లో ఎన్టీఆర్ కు బాద్ షా మూవీ నుంచి మంచి క్రేజే ఉంది. తమిళ హీరో రజినీకాంత్ తర్వాత ఆయనకు అక్కడ మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవచ్చు. నేటి తరం ప్రేక్షకులు ఎన్టీఆర్ డ్యాన్స్ లకు, ఫైట్లకు ఫిదా అవుతున్నారు. ఈ విషయంలో మన నందమూరి చిన్నోడు ముందుంటాడనే చెప్పుకోవాలి. ఈ క్వాలిటే ఆయనకు విదేశాల్లో మంచి క్రేజ్ సంపాదించి పెట్టింది. ఆర్ఆర్ఆర్ దాదాపు ప్రపంచంలోని చాలా భాషల్లో రిలీజ్ అవుతూనే ఉంది. రూ. 1200 కోట్లు ఇప్పటి వరకు కలెక్షన్ రాబట్టిందంటే సినిమా లెవలేమిటో ఇట్టే అర్థమవుతోంది. సింథిల్ కుమార్ ఫొటోగ్రఫీ ఈ మూవీకి మంచి గుర్తింపు తెచ్చిపెడితే, కీరవాణి మ్యూజిక్ గురించి వేరేగా చెప్పనవసరం లేదు. ఇండియాలో తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హందీ లాంటి భాషల్లో  విపరీతమైన క్రేజ్ తెచ్చుతున్న చిత్రం ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ లో ఉంటే జీ5లో మిగతా భాషల్లో స్ర్టీమింగ్ లో ఉంది. 

ఈ సినిమా ఇంగ్లిష్, ఫ్రాన్స్, జపాన్ ఇలా విదేశాలలో విడుదల అవుతూనే ఉంది. ఆస్కార్ రేసులో దూసుకెళ్తుందని వినిపిస్తూనే ఉంది. కానీ ఫిల్మ్ ఫెడరరేషన్ ఆఫ్ ఇండియా షాకిచ్చి గుజరాతీ చిత్రం ‘చెల్లో షో’ను దేశం తరుఫున ఆస్కార్ కు పంపారు. దీని విషయంలో ఫిల్మ్ ఫెడరేషన్ పై మన అభిమానులు గుస్సా అవుతూనే ఉన్నారు. ఫెడరేషన్ తో పని కాదన్నట్లు గ్రహించిన ఆర్ఆర్ఆర్ యూనిట్ సొంతంగా పంపేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 

ఇక అసలు విషయానికి వస్తే గత శుక్రవారం (21.10.2022) రోజు జపాన్ లో రిలీజ్ కు చిత్ర యూనిట్ వెళ్లింది. అక్కడ విడుదలలో భాగంగా ఎన్టీఆర్ జపాన్ భాషలో మాట్లాడడం అక్కడి ఫ్యాన్స్, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అభిమాన హీరో తమ మాతృభాషలో మాట్లాడుతుండడంతో థియేటర్ హోరెత్తింది. చప్పట్లు, ఈలలో ఎన్టీఆర్ ను అందరూ ప్రశంసించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here