Home తాజా వార్తలు చనిపోయి కూతురి పెళ్లి కోసం మళ్ళీ తిరిగొచ్చిన నాన్న…వీడియొ చూస్తే అస్సలు కన్నీళ్లు ఆగవు…

చనిపోయి కూతురి పెళ్లి కోసం మళ్ళీ తిరిగొచ్చిన నాన్న…వీడియొ చూస్తే అస్సలు కన్నీళ్లు ఆగవు…

0

ఎక్కడ చూసిన భారీ ఏర్పాట్లతో ఖరీదైన కల్యాణ మండపం..మరికాసేపట్లో పెళ్లి అనగా పెళ్లి కొడుకు,పెళ్లి కూతురు పెళ్లి కి సిద్ధం గా ఉన్నారు.పక్కనే పెళ్లి కూతురు తల్లి మరియు అన్నయ్య ఎమోషనల్ గా ఉన్నారు.ఇంతలో డోర్ నుంచి ఒకరు వీల్ చైర్ మీద వస్తున్నారు.అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.కన్నీళ్లు ఆపుకోలేక పెళ్లి కూతురు కుటుంబం ఏడ్చేశారు.అసలు ఇది ఎలా సాధ్యం అంటూ విలపించారు…వివరంగా చెప్పాలంటే…ఒక తండ్రి తమను ఎంతగానో చదివించి ప్రయోకులని చేసి,ఆస్తులను పంచారు.ఇటీవలే తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.దింతో పెళ్లి కూతురు అన్నయ్య చెల్లి పెళ్లిని ఘనంగా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు.

కల్యాణ మండపంలో పెళ్ళికి అందరు వచ్చిన తర్వాత అందరికి షాక్ ఇచ్చాడు పెళ్లి కూతురు అన్నయ్య.మైనంతో చనిపోయిన వాళ్ళ నాన్న విగ్రహాన్ని మల్లి సృషించాడు.అచ్చం వాళ్ళ నాన్న లాగే ఆ మైనం విగ్రహాన్ని తయారు చేయించాడు.కానీ తాను ఆలా విగ్రహం చేయించినట్టు ఎవ్వరికీ తెలియదు.తన చెల్లి అయినా పెళ్లి కూతురుకి నాన్న లేని లోటు తీర్చాలని,చెల్లికి సర్ప్రైస్ ఇవ్వాలని అన్న భావించాడు.

పెళ్లి మండపంలో చనిపోయిన నాన్న ఎంట్రీ చూడగానే ఆయన భార్య పిల్లలు బోరున విలపించారు.పెళ్లి కూతురు తన నాన్న ను హత్తుకొని బోరున విలపించింది.చుట్టూ ఉన్న బంధువులు కూడా ఆ సన్నివేశాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.అక్కడున్న వారంతా ఆయనతో ఫోటోలు దిగి పెళ్లిని పరిపూర్ణం చేసారు.ఈ వీడియొ ప్రస్తుతం ఎటుచూసినా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here